ఒకేసారి 1.12 లక్షల మందికి ఆన్లైన్ క్లాస్ నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాయి ఐఐటీ మద్రాస్‌కు చెందిన అంకుర సంస్థ గవీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) సంస్థలు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై 24 గంటల పాటు క్లాస్ నిర్వహించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాయి.
ఏప్రిల్ 30 నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందించారు.
ఆన్లైన్ తరగతికి హాజరైన విద్యార్థులు 'ఏఐ ఫర్ ఇండియా' పేరుతో ఏప్రిల్ 24- 25న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 24 గంటల వ్యవధిలో ఎక్కువ మంది ప్రోగ్రామింగ్ క్లాసుకు హాజరవడం వల్ల ఈ ఘనతను సాధించాయి.
ఎక్కువ మందితో ఆన్లైన్ క్లాస్ దేశంలోని ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ గురించి తెలియాలనే లక్షంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గవీ(జీయూవీఐ) సహవ్యవస్థాపకురాలు శ్రీదేవి తెలిపారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో చోటు ఈ కార్యక్రమంలో భాగంగానే.. ఫేస్ రికగ్నిషన్ యాప్ అభివృద్ధిపై నిర్వహించిన ఆన్లైన్ క్లాస్‌కు 1.43 లక్షల మంది హాజరయ్యారు. ఏఐసీటీఈ, గవీ, ఐఐటీ మద్రాస్ పరిశోధన కేంద్రం బుద్ధి.ఏఐ .. సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. పాఠశాల స్థాయి విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులు, నాన్ ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోడింగ్‌పై ఆసక్తి ఉన్న 8 నుంచి 80 ఏళ్ల లోపు ఎందరో.. ఇందులో పాలు పంచుకున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి:రూ.21కోట్ల యురేనియం స్వాధీనం- ఇద్దరు రిమాండ్