హరియాణా మనేసర్ జిల్లాలో అర్ధరాత్రి పూట కాల్పుల మోత మోగింది. కాసన్ గ్రామంలోని ఓ కుటుంబంపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అర్ధరాత్రి వేళ కుటుంబంపై కాల్పులు- ఒకరు మృతి - haryana maesar news
అర్ధరాత్రి పూట దుండగలు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హరియాణాలో కాల్పులు
కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పటౌదీ ఏసీపీ వీర్ సింగ్ తెలిపారు. పాత కక్షలతోనే దుండగలు కాల్పులకు తీవ్రంగా తెగబడినట్లు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు.