దేశంలో ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. హరియాణాలో ఆక్సిజన్ లేమి కారణంగా నలుగురు కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. గురుగ్రామ్‌లోని కతూరియా ఆస్పత్రిలో ఆదివారం జరిగింది. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మృతుల బంధువులు. వైద్యశాలలో ప్రాణవాయువు కొరత తీర్చాలని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు.
ఆస్పత్రిలో మెడికల్ ఆక్సిజన్ కొరతపై జిల్లా యంత్రాంగం, ఆరోగ్యశాఖకు పలుమార్లు విన్నవించినా సమయానికి స్పందించలేదని వైద్య వర్గాలు తెలిపాయి.
"ఆదివారం ఉదయం 11 గంటలకు కతూరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ సంక్షోభం తలెత్తింది. ప్రాణవాయువు సరఫరా లేనందున 50 మంది రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వైద్య సిబ్బంది వారందరినీ రక్షించేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. అయినప్పటికీ నలుగురు కొవిడ్ రోగులు మరణించారు."
- డాక్టర్ ఏకే.కతూరియా, ఆస్పత్రి డైరెక్టర్