తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డేరా బాబాకు పెరోల్​పై విమర్శలు.. నా పాత్రేమీ లేదన్న ముఖ్యమంత్రి - డేరా బాబాకు పెరోల్

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్​కు పెరోల్ రావడం వెనక తన పాత్ర లేదని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

KHATTAR DERA CHIEF
KHATTAR DERA CHIEF

By

Published : Oct 27, 2022, 10:04 AM IST

హరియాణాలో అదమ్‌పూర్ ఉపఎన్నిక, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 40 రోజుల పెరోల్‌ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసినందుకు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. డేరా ఆశ్రమ మేనేజర్‌ హత్య, జర్నలిస్ట్‌ హత్యకేసులోనూ ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. నవంబరు 3న అదమ్‌పూర్‌ ఉపఎన్నిక జరగనుంది.

గత వారం డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 40 రోజుల పెరోల్‌ మంజూరైంది. అయితే, ఇందులో తన పాత్రమీ లేదని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. జైళ్ల నియమనిబంధనల ప్రకారమే.. పెరోల్‌ వచ్చి ఉంటుందని చెప్పారు. కొన్ని రోజులుగా ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బర్ణవ ఆశ్రమం నుంచి డేరాబాబా ఆన్‌లైన్‌ ఉపన్యాసాలు ఇస్తున్నారు.ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో ఆయన అనుచరులతో పాటుహరియాణాకు చెందిన కొందరు భాజపా నేతలు హాజరయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మూడు వారాల పెరోల్ ఇవ్వడం విమర్శలు దారితీసింది.

ఈ విషయంపై స్పందించిన దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.. రామ్ రహీమ్ సింగ్ పెరోల్​ను వెనక్కి తీసుకోవాలని హరియాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'రామ్ రహీమ్ ఓ రేపిస్ట్, హంతకుడు. హరియాణా ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు ఆయనకు పెరోల్ ఇస్తోంది. రామ్ రహీమ్ బయటకు వచ్చి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన కొంతమంది నేతలు అందులో పాల్గొంటున్నారు' అని స్వాతి మలివాల్ చెప్పుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details