తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గూగుల్ మ్యాప్​ చూసి అట్టతో 'లండన్' నమూనా తయార్.. చూస్తే మైమరచిపోవాల్సిందే! - పంజాబా తాజా వార్తలు

లండన్​ నగర నమూనాను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకుంటున్నాడు పంజాబ్​కు చెందిన ఓ వ్యక్తి. తన ప్రతిభతో చూపరులను అబ్బురపరుస్తున్నాడు. అయితే లండన్​ సిటీ నమూనాను తయారు చేసేందుకు బలమైన కారణం ఉందని అతడు చెబుతున్నాడు. ఓ సారి ఆ కారమేంటో తెలుసుకుని లండన్​ నమూనాను చూసొద్దాం రండి..

GURDEEP SINGH A RESIDENT OF LUDHIANA MADE A MODEL OF THE CITY OF LONDON
GURDEEP SINGH A RESIDENT OF LUDHIANA MADE A MODEL OF THE CITY OF LONDON

By

Published : Jan 2, 2023, 9:37 PM IST

గూగుల్ మ్యాప్​ చూసి అట్టతో 'లండన్' నమూనా తయార్.. చూస్తే మైమరచిపోవాల్సిందే!

ఆయనకు చిన్నప్పటి నుంచి లండన్​కు వెళ్లాలని కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అప్పుడే అతడు ఓ నిర్ణయానికి వచ్చాడు. లండన్​ నగర నమూనాను తయారు చేసి ఆనందం పొందవచ్చని అనుకున్నాడు. గూగుల్​ మ్యాప్​ ఉపయోగించి మూడున్నరేళ్లు కష్టపడి లండన్ సిటీ నమూనాను ఎంతో అద్భుతంగా తయారు చేశాడు. అతడే పంజాబ్​లోని లుధియానాకు చెందిన గుర్దీప్​ సింగ్​.

లండన్ సిటీ నమూనా

గుర్దీప్​ సింగ్​.. చిన్నప్పటి నుంచి వివిధ నగరాలు, స్టేడియంల నమూనాలను తయారు చేసేవాడు. ఆ ఆసక్తితోనే కేవలం అట్టను ఉపయోగించి లండన్​ నగర నమూనాను రూపొందించాడు. లండన్​లోని ప్రతీ భవనం, రహదారులు, రైల్వే స్టేషన్​.. ముఖ్యంగా బ్రిడ్జ్​ను ఎంతో అందంగా తయారు చేశాడు. నీటి వల్ల అట్ట పాడవ్వకుండా ఉండేందుకు ఐరన్​ షీట్​ను కూడా ఉపయోగించాడు. ముఖ్యంగా ఆకర్షణీయమైన లైట్లను అమర్చాడు. వాటి వల్ల మొత్తం నమూనాకే అందం వచ్చిందని చెప్పొచ్చు.

లండన్ బ్రిడ్జ్

"లండన్​ నమూనాను తయారు చేయడానికి 3.5 సంవత్సరాల సమయం పట్టింది. రాత్రిపూట కూడా శ్రమించి దీనిని పూర్తిచేశాను. మూడున్నరేళ్ల శ్రమ తర్వాత ఈ నమూనా తయారైంది. ఇంత గొప్పగా వస్తుందని అనుకోలేదు. దీనిని తయారు చేయడానికి డబ్బులు ఎప్పుడూ లెక్కలు వేయలేదు. రూ.50వేల దాకా ఖర్చయి ఉంటుంది. లండన్​ వెళ్లి అక్కడ నివసించాలనేదే నా కల. అక్కడకి వెళ్లడానికి ప్రయత్నించాను కానీ వీసా రాకపోవడం వల్ల వెళ్లలేకపోయాను. మొదట నమూనాను తయారు చేయడానికి పలు వీడియోలు చూసినప్పుడు చాలా తికమకపడ్డాను. తర్వాత కొంత మంది సహాయంతో దీనిని పూర్తి చేయగలిగాను. నాకు చిన్నప్పటి నుంచి నమూనాలు తయారు చేయడం అంటే ఇష్టం. ఇంతకు ముందు కూడా మొహలీ హుభు స్టేడియంను కూడా తయారు చేశాను. కానీ ఇంట్లో స్థలం లేకపోవడం వల్ల ఆ నమూనా పాడైపోయింది. నేను తయారు చేసిన లండన్ నమూనాను ఎగ్జిబిషన్​లో ప్రదర్శిస్తాను."

-- గుర్దీప్ సింగ్

లండన్ సిటీలో టూరిస్ట్​లను ఎంతగానో ఆకర్షించే బ్రిడ్జ్​ను చక్కగా తయారు చేసిన గుర్దీప్​.. దానికి రిమోట్​ కంట్రోల్​ సిస్టమ్​ను అమర్చాడు. బటన్​ ప్రెస్​ చేస్తే బ్రిడ్జి.. విడిపోయి మళ్లీ కలుస్తుంది. ఈ నమూనాను చూస్తుంటే మినీ లండన్​ను చూసినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details