Gunfire While Watching KGF Chapter-2: కర్ణాటక హవేరి జిల్లా శిగ్గావిలో కాల్పులు కలకలం రేపాయి. వసంతకుమార్ అనే యువకుడిని తుపాకీతో కాల్చాడు ఓ వ్యక్తి. కేజీఎఫ్ చాప్టర్-2 సినిమా చూస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడు కేజీఎఫ్ సినిమా చూస్తుండగా.. నిందితుడికి కాలు తగిలింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు తుపాకీతో వసంతకుమార్ను కాల్చాడు. తీవ్రగాయాలు కావడం వల్ల చికిత్స నిమిత్తం అతడిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
'కేజీఎఫ్' థియేటర్లో.. కాలు తాకిందని కాల్చేశాడు.. - gun fire news in kgf movie
Gunfire While Watching KGF Chapter-2: కేజీఎఫ్-2 సినిమా చూస్తుండగా కాలు తాకిందని వసంతకుమార్ అనే యువకుడిని కాల్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగింది.

Gunfire while KGF Chapter-2 movie show
Last Updated : Apr 20, 2022, 12:39 PM IST