జమ్ముకశ్మీర్ రాజౌరీలో శుక్రవారం.. భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనమండీ అడవి ప్రాంతంలో ముష్కరల కోసం అధికారులు గాలిస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఆ ముఠాలో ముగ్గురు లేదా నలుగురు ముష్కరులు ఉన్నారని.. వారిలో ఇద్దరు పాక్ ఆక్రమిక కశ్మీర్ నుంచి వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం - జమ్ము కశ్మీర్ వార్తలు
జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. తానామండీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడం వల్ల సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
![జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం jammu kashmir encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12692237-thumbnail-3x2-jk.jpg)
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
రాజౌరీ జిల్లాలోని అడవి ప్రాంతాల్లో నెల రోజులుగా ముష్కరుల కదలికలను భద్రతా దళాలు పర్యవేక్షిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం తానామండీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఇదీ చదవండి :కశ్మీర్ లోయలో తెరపైకి కొత్త ఉగ్ర సంస్థలు