తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గులాబ్​'తో ఒడిశా గజగజ- కుండపోత వానలు, ఉప్పొంగిన వాగులు - gulab cyclone news today

గులాబ్ తుపాను ధాటికి (Gulab Cyclone updates) ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో వీచిన ఈదురు గాలులకు అనేక చెట్లు నేల కూలాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

GULAB UPDATE
'గులాబ్​'తో ఒడిశా గజగజ

By

Published : Sep 27, 2021, 6:31 PM IST

Updated : Sep 27, 2021, 6:56 PM IST

ఒడిశాలో కుండపోత వానలు, ఉప్పొంగిన వాగులు

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను ప్రభావంతో (Gulab Cyclone updates) ఒడిశా చిగురుటాకులా వణికిపోయింది. చాలా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కోరాపుట్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులు అరవు, నారాయణపట్న ప్రాంతాల నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు. (Gulab Cyclone news)

వర్షాల ధాటికి కూలిన ఇంటిగోడ
పశువుల పాక పక్కన గోడపై పడిపోయిన చెట్టు
చెట్లను తొలగిస్తున్న జేసీబీ

భీకర ఈదురుగాలులకు వందల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. రహదారులకు అడ్డంగా ఇవి పడిపోవడం వల్ల.. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన వృక్షం
అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు

రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. రహదారులకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలను తొలగిస్తున్నారు.

మల్కన్​గిరి జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కంగుర్​కొండ నుంచి మల్కాన్​గిరి వెళ్లే దారిలో నీటి ప్రవాహం తీవ్రంగా ఉంది. వంతెనలపై నుంచే నీరు ప్రవహిస్తోంది.

ఇదీ చదవండి:

Last Updated : Sep 27, 2021, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details