గుజరాత్, దహోడా జిల్లా భువేరా గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు బాలికలు తమ తమ ఫోన్లలో మాట్లాడుతుండగా ఆగ్రహించిన గ్రామస్థులు.. బాలికలపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నెల రోజుల తర్వాత పోలీసుల దృష్టికి వెళ్లింది.
ఏం జరిగిందంటే..?
బాలికలపై గ్రామస్థులు దాడి చేస్తున్న దృశ్యాలు దహోడా జిల్లా భువేరా గ్రామంలో 13, 16 ఏళ్ల వయస్సు గల ఇద్దరు బాలికలు జూన్ 25న ఫోన్లలో సంభాషిస్తుండగా కొంతమంది పురుషులు తీవ్ర అభ్యంతరం చెబుతూ వారిని చుట్టుముట్టి పరుషమైన పదాలతో దూషించారు. భౌతిక దాడికీ పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
దాడి సమయంలో బాలికలు తీవ్ర భయంతో వణికిపోతున్న దృశ్యాన్ని ఎవరో వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. చివరకు పోలీసులు స్పందించి 12 మంది నిందితులపై బాలల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:ప్రియుడిపై కోపంతో మెట్రో స్టేషన్ ఎక్కి దూకబోయిన యువతి