తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యర్థాలతో శిల్పం- పర్యావరణంపై సామాజిక సందేశం - రీసైక్లింగ్ వ్యర్థాలు

వ్యర్థాలతో అందమైన శిల్పాలను నిర్మించి సామాజిక సందేశం ఇస్తున్నారు సూరత్ నగరపాలక సంస్థ అధికారులు. ఆయా ప్రాంతాలకు ఉన్న విశిష్ఠతలు, ‌అక్కడ ప్రజల జీవన శైలిని బట్టి శిల్పాలు ఏర్పాటు చేశారు. గుర్రం, గర్జిస్తున్న సింహం సహా పలు ఆకారాల్లో ఉన్న శిల్పాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

gujarat Surat Sculptures
వ్యర్థాలతో అద్భుత శిల్పాలు

By

Published : Aug 8, 2021, 1:15 PM IST

వ్యర్థాలతో అందమైన విగ్రహాలు

గుజరాత్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన సూరత్‌లో వ్యర్థాలతో నిర్మించిన శిల్పాలను భారీగా ఏర్పాటు చేశారు. ఇనుము, పారేసిన ప్లాస్టిక్‌, ఇతర పనికిరాని వస్తువులతో కళాకారులు, యువతను భాగస్వామ్యం చేసి మొత్తం 58 విగ్రహాలను సూరత్‌ నగర పాలక సంస్థ తయారు చేయించింది. సూరత్‌లో ఆయా ప్రాంతాలకు ఉన్న విశిష్ఠతలు, ‌అక్కడ ప్రజల జీవన శైలిని బట్టి శిల్పాలు ఏర్పాటు చేశారు.

గుర్రం

సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ మ్యూజియం వద్ద గుర్రం సహా వివిధ ఆకారాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. సామాజిక సందేశాలను ఇచ్చేలా శిల్పాలను తయారు చేయించినట్లు సూరత్ నగర పాలక సంస్థ కమిషనర్ బంచానిధి పాణి వెల్లడించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో భారీ రాక్షసుడి రూపాన్ని తయారు చేయించిన కమిషనర్‌.. బీచ్‌లు, పబ్లిక్ ప్రదేశాల్లో పాస్టిక్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను రాక్షసుడి రూపం ప్రతిబింబిస్తున్నట్లు తెలిపారు. సూరత్‌లోని డ్యుమస్ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే ప్లాస్టిక్‌ రాక్షసుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. డ్యుమస్‌లో సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లనే విగ్రహంలో ఎక్కువగా ఉపయోగించినట్లు కమిషనర్ వెల్లడించారు.

రాక్షసుడి ఆకారం
.

40 కేజీల వ్యర్థ ఇనుమును ఉపయోగించి తయారు చేసిన సింహం విగ్రహం... మరింతగా ఆకట్టుకుంటోంది. సింహం గర్జిస్తున్నట్లుగా రూపొందించిన శిల్పాన్ని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశారు.

గర్జిస్తున్న సింహం
.

రీసైక్లింగ్, మొక్కల పెంపకం, స్వచ్ఛ భారత్, భేటీ బచావో- భేటీ పడావో వంటి సందేశాలను చాటేలా కూడా విగ్రహాలు తయారు చేయించినట్లు కమిషనర్ వెల్లడించారు.

వ్యర్థాలతో విగ్రహం

ఇదీ చదవండి:కన్నబిడ్డనే బస్సు కిందకు తోసేసిన తల్లి.. చివరకు...

ABOUT THE AUTHOR

...view details