గుజరాత్ సూరత్‌కు చెందిన కళాకారుడు అజాజ్ చేతులు అద్భుతాన్ని చేశాయి. అయోధ్య రామ మందిర నమూనాలో (Ayodhya Ram Mandir).. థర్మకోల్‌తో మినీ గణేశ్ ఆలయాన్ని రూపొందించి వారెవ్వా అనిపించాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ కళాఖండాన్ని రూపొందించాడు.
"మేము థర్మకోల్‌తో దీనిని తయారు చేశాం. ఆలయ ప్రతి ఆకృతిని చక్కగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం. మొత్తం ఆరుగురం కలిసి పనిచేశాం. కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేసేశాం."
-అజాజ్, కళాకారుడు