Gujarat Man Assists Destitute Patients : ప్రస్తుత రోజుల్లో సహాయం అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు చాలా మంది. ఆర్థికంగా కాకపోయినా.. మాట సాయం చేసేవారు కూడా ఎవరూ కనిపించడం లేదు. ఇంకా చదువుకోని అభాగ్యులు ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలకో.. ఆసుపత్రికో వెళ్తే పట్టించుకోనే నాధుడే ఉండడు. ఎవరి పనుల్లో వారే ఉంటారు.. అడిగినా కూడా సమాధానం చెప్పారు. కానీ, గుజరాత్‌లోని సిటీ ఆసుపత్రిలో మాత్రం నేను ఉన్నానంటూ ముందుకు వస్తున్నాడు ఓ వ్యక్తి... ఆసుపత్రికి వచ్చిన వారికి తాను చేయదగిన సహయన్ని అందిస్తున్నాడు.
రాజ్‌కోట్‌కు చెందిన జితేంద్ర సింగ్... సిటీ ఆసుప్రతికి వైద్యం కోసం వచ్చే పేద రోగులకు సహాయన్ని అందిస్తున్నాడు. గత 15 సంవత్సరాల నుంచి ఇలానే సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న దుకాణం నడుపుతూ జీవనం సాగించే జితేంద్ర.. ఖాళీ సమయంలో తనకు చేతనైనంత సహాయం అందిస్తున్నాడు. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మార్గనిర్దేశాలు చేస్తూ సహాయం చేస్తున్నాడు...
నేను పేదరోగులకు సహాయం చేస్తాను. అది కూడా బంధువులు ఎవరూ లేని వారికి సాయం అందిస్తాను. ఇప్పటివరకు సుమారు 108 మంది రోగులకు వైద్య సదుపాయాలను పొందేలా సాయం చేశాను. వారికి ఎక్స్-రేలు తీయించటం, మందులు తెచ్చి ఇవ్వటం వంటివి చేశాను. ఇలా నేను చేయగలిగినది ఏమైనా సహాయం చేస్తాను.
-జితేంద్ర సింగ్