తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీకి క్లీన్​చిట్​' కేసు మరోసారి వాయిదా - సిట్​ క్లీన్​చిట్​పై సుప్రీంకోర్టు

గుజరాత్​ అల్లర్లకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి సిట్​ క్లీన్​చిట్​ ఇవ్వడంపై దాఖలైన కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. పిటిషనర్​ విజ్ఞప్తి మేరకే వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

supreme court on SIT clean chit, సిట్​ క్లీన్​చిట్​పై సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

By

Published : Apr 13, 2021, 2:32 PM IST

2002 గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రెండు వారాల తర్వాత తదుపరి విచారణపై ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. పిటిషనర్​ వినతి మేరకే విచారణను వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.

క్లీన్‌చిట్‌ను సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

ఇదీ చదవండి :ఈసీ నిషేధంపై దీదీ నిరసన

ABOUT THE AUTHOR

...view details