గుజరాత్‌లో ఆదివారం జరగాల్సిన పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామక పరీక్ష పేపర్ లీక్ అయ్యింది. ఈ కారణంగా పరీక్షను వాయిదా చేశారు అధికారులు. పేపర్ లీక్‌కు పాల్పడిన ప్రధాన నిందితుడు ఇసామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి వద్ద ప్రశ్నాపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సహా 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రశ్నాపత్రం ముద్రణ జరిగిన హైదరాబాద్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై తదుపరి విచారణ జరుగుతోందని గుజరాత్ పంచాయతీ సర్వీస్ సెలక్షన్ తెలిపింది. వీలైనంత త్వరగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. పరీక్ష నిర్వహణకు 2 గంటల ముందే పేపర్ లీక్ అయ్యిందని పేర్కొంది.
పోటీ పరీక్ష పేపర్ లీక్.. ఎగ్జామ్ వాయిదా.. ఆందోళనలో నిరుద్యోగులు - పేపర్ లీక్ వివాదం గుజరాత్
గుజరాత్‌లో పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామక పరీక్ష పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఈ పరీక్షను వాయిదా వేశారు అధికారులు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
పేపర్ లీక్ ఘటనపై ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1,181 పంచాయతీ జూనియర్ క్లర్క్ ఉద్యోగాల కోసం మొత్తం 9.50 లక్షల మంది దరఖాస్తు చేశారు. మరోవైపు పేపర్ లీక్ ఘటనపై కాంగ్రెస్, ఆప్.. భాజపాపై విమర్శలు గుప్పించాయి. 'గత 12 ఏళ్లుగా 15 సార్లు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి పరీక్షలు రద్దు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది.' అని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి ఆరోపించారు.