mass marriage surat: సాధారణంగా వివాహమంటే భారీ ఖర్చు తప్పదు. అయితే వివాహ వేడుకల ఖర్చు భరించలేని పేదవారు ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి 300 మంది యువతులకు సామూహిక వివాహ వేడుక నిర్వహించి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు పీపీ సవానీ గ్రూప్ అధినేత మహేశ్ సవానీ. పెళ్లి ఖర్చు తగ్గించడం సహా తల్లిదండ్రులు లేని యువతులకు అన్నీతామై వివాహాలు నిర్వహిస్తూ అండగా నిలుస్తున్నారు ఆయన. సంస్థ 2008లో తొలిసారిగా ప్రారంభించిన ఈ సామూహిక వివాహ వేడుక నేటికీ కొనసాగుతుండటం విశేషం.
pp savani group surat: గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో డిసెంబర్ 4, 5 తేదీల్లో ఈ సామూహిక వివాహాలు జరిగాయి. దీనితో వీరి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4 వేలకు పైగా జంటలు ఒక్కటయ్యాయని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే కరోనా మూడో దశ భయాలు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కారణంగా ఈ వివాహా వేడుకకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు.
mahesh savani: ఈ సందర్భంగా 4000 మందికి పైగా ఆడపిల్లలకు పెంపుడు తండ్రిగా మారి కన్యాదానం జరిపించినందుకు గర్వపడుతున్నానని మహేశ్ సవానీ అన్నారు.