10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడి, ఒకరిని హత్య చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేళ్ల బాలికను అత్యాచారం చేస్తుండగా.. కేకలు వేస్తోందన్న కారణంగా చంపేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
ఏమైందంటే..?
గుజరాత్, గాంధీనగర్ జిల్లా కలోల్ మండలం వన్సజదా గ్రామానికి చెందిన విజయ్ ఠాకూర్(26).. ఓ రోజు కూలీ. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మొబైల్ ఫోన్లో అతిగా పోర్న్ చిత్రాలు చూసేందుకు అలవాటుపడ్డ విజయ్.. నవంబరు 4న రంచర్దా గ్రామంలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. తర్వాత బాలికపై అత్యాచారం చేసి.. అదే రోజు గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారిని వదిలి వెళ్లాడు. బాలికకు వైద్యపరీక్షలు చేయగా.. అత్యాచారానికి గురైనట్లు తేలింది. ఇదే ఘటనపై బాధితురాలి తల్లి సంతెజ్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేకలు వేస్తుందని..
మరుసటి రోజు నవంబరు 5 రాత్రి.. మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు విజయ్. చిన్నారి పెద్దగా కేకలు పెట్టటం వల్ల చంపేశాడు. ఆ తర్వాత రేప్ చేసి.. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న కల్వర్టులో పడేశాడు. ఈ ఘటనపైనా సంతెజ్ స్టేషన్కు ఫిర్యాదు అందింది.