కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా గుజరాత్లో ఓ వైద్య శాఖ అధికారికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయన జనవరి 16న మొదటి డోసు, ఫిబ్రవరి 15న రెండో డోసు తీసుకున్నారు. రెండోసారి టీకా వేసుకున్నప్పుడు జ్వరం వచ్చిందని, రక్త పరీక్షలు చేయించగా కొవిడ్ పాజిటివ్ అని తేలిందని గాంధీనగర్ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ హెచ్.ఎం.సోలంకి చెప్పారు. ఆయనలో స్వల్ప లక్షణాలు కనిపించగా.. ఇంట్లోనే ఏకాంతంలో ఉన్నారని తెలిపారు.
టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్! - h.s solanki
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. గుజరాత్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఫిబ్రవరి 15న వ్యాక్సిన్ రెండో డోసు వేసుకోగా.. ఆయనకు జ్వరం వచ్చింది. పరీక్షల్లో.. వైరస్ సోకిందని తేలింది.
టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్
సాధారణంగా రెండు డోసులు తీసుకున్న అనంతరం శరీరంలో యాంటీబాడీల అభివృద్ధికి 45 రోజులు పడుతుందని హెచ్.ఎం.సోలంకి చెప్పారు. టీకా తీసుకున్న తరవాత కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను తప్పకుండా పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:ఆరో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు వీరే