తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల రాజీనామా - Gujarat Local Body Election results news

Gujarat Local Body Election results
గుజరాత్ స్థానిక పోరులో భాజపా జోరు

By

Published : Mar 2, 2021, 12:48 PM IST

Updated : Mar 2, 2021, 6:47 PM IST

18:43 March 02

గుజరాత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల రాజీనామా

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ పార్టీ వెనకబడిన క్రమంలో ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్​ చావ్​డా, రాష్ట్ర సీఎల్​పీ నేత పరేశ్​ ధనాని తమ పదవులకు రాజీనామా చేశారు.  

" మా అంచనాలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతుంది. "

        - అమిత్​ చావ్​డా, గుజరాత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు. 

18:19 March 02

గుజరాత్​ ప్రజలకు నా కృతజ్ఞతలు: నడ్డా

'అభివృద్ధి, నమ్మకానికి ప్రతీకైన భాజపాపై స్థానిక సంస్థల ఎన్నికల్లో గుజరాత్ ప్రజలు విశ్వాసాన్ని మరోమారు చూపించినందుకు నా కృతజ్ఞతలు' అని ట్వీట్​ చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.  

17:59 March 02

'భాజపాతోనే గుజరాత్ ప్రజలు- స్థానిక ఫలితాలే నిదర్శనం'

'భాజపాతోనే గుజరాత్ ప్రజలు- స్థానిక ఫలితాలే నిదర్శనం'

గుజరాత్​ స్థానిక ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకుపోతున్న క్రమంలో ట్వీట్​ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజలు భాజపాతోనే ఉన్నారనేందుకు ఫలితాలే నిదర్శనమన్నారు.  

" గుజరాత్​లో జరుగుతున్న నగర పాలక, తాలూక పంచాయత్​, జిల్లా పంచాయత్​ ఎన్నికలు.. భాజపా అభివృద్ధి, సుపరిపాలన అజెండాతోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. భాజపా పట్ల తిరుగులేని నమ్మకం, బంధాన్ని కలిగి ఉన్నందుకు గుజరాత్​ ప్రజలకు నమస్కరిస్తున్నా. "

   - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.  

17:44 March 02

గుజరాత్ స్థానిక పోరులో భాజపా హవా

గుజరాత్ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా దూసుకుపోతోంది. వివిధ మున్సిపాలిటీలు, జిల్లా, తాలూకా పంచాయతీలకు సంబంధించి.. 8,474 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 2,771 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. భాజపా 2,085 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 602 స్థానాల్లో గెలుపొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ 15, బీఎస్పీ 5, స్వతంత్రులు 42 స్థానాల్లో గెలుపొందారు. 

మున్సిపాలిటీలకు సంబంధించి.. భాజపా 803 చోట్ల, కాంగ్రెస్ 159 చోట్లా గెలుపొందాయి. జిల్లా పంచాయతీలకు సంబంధించి.. భాజపా 246, కాంగ్రెస్ 55 చోట్ల విజయం సాధించాయి.

తాలూకా పంచాయతీలల్లో.. భాజపా 1,036 చోట్ల, కాంగ్రెస్ 388 స్థానాల్లో.. గెలుపొందాయి. 

81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. 237 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 8,474 స్థానాలకు ఎన్నికలు జరిపారు.

12:15 March 02

లైవ్​: గుజరాత్ స్థానిక పోరులో భాజపా జోరు

గుజరాత్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాథమిక ఫలితాల్లో భాజపా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో 52.82 శాతం ఓటింగ్​ నమోదు కాగా.. జిల్లా పంచాయతీల్లో 58.82 శాతం, తాలుకా పంచాయతీల్లో 66.6 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది.

ఇటీవల జరిగిన నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 576 స్థానాలకు గాను ఏకంగా 483 చోట్ల విజయ దుందుబి మోగించింది.

Last Updated : Mar 2, 2021, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details