తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో దారుణం.. బాలికను నరబలి ఇచ్చిన దుండగులు.. తండ్రికి తెలిసే జరిగిందా?

కేరళ నరబలి కేసును మరువకముందుకే ఇప్పుడు గుజరాత్​లో అలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను కొందరు దుండగులు నరబలి ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

gujarat dhav gir latest news
minor killed in gujarat

By

Published : Oct 13, 2022, 12:54 PM IST

Updated : Oct 13, 2022, 3:25 PM IST

ఇటీవలే కేరళలో వెలుగుచూసిన నరబలి కేసు మరువకముందే తాజాగా ఇదే తరహా దారుణం గుజరాత్​లోని సోమనాథ్​ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఓ బాలికను నరబలి ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

​జిల్లాలోని ధావాగిర్​లో ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు నరిబలి ఇచ్చినట్లు పోలీసులకు తెలిసింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి ఆ బాలికను నరబలి ఇచ్చారా లేదా అన్న విషయంపై విచారణ చేపడుతున్నారు.

అయితే ఇంతవరకు ఎవరూ ఈ ఘటనపై ఫిర్యాదు చేయకపోవడం వల్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో బాలిక తండ్రితో పాటు మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రిని విచారించగా సరిగ్గా సమాధానాలు చెప్పలేదు. దీంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ఘటనాస్థలిలో దొరికిన అన్ని ఆధారాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

బిహార్​ రాజధానిలో బాలికపై అత్యాచారం...
బిహార్​ రాజధాని పట్నాలో ఓ 16 ఏళ్ల బాలికపై వరసకు సోదరుడయ్యే వ్యక్తి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ఆ బాలిక వాంగ్మూలం తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే.. పట్నాలోని నౌబత్​పుర్​లో ఓ బాలిక పదవ తరగతి చదువుకుంటోంది. అక్టోబర్​ 7న సుమారు 10 గంటల సమయంలో యథావిధిగా పాఠశాలకు సైకిల్​ తొక్కుతూ వెళ్తున్న ఆ విద్యార్థినిని దారి మధ్యలో ఆమె సోదరుడితో పాటు మరో కొంతమంది యువకులు అడ్డుకున్నారు. దగ్గరలోని ఓ తోటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారాన్ని వీడియో తీసిన యువకులు..జరిగింది బయటకు చెప్తే వీడియోను లీక్​ చేస్తామని బెదిరించారు. బాలిక కేకలకు స్థానికులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఇంటికి చేర్చారు.

అప్పటికే నిందితులు పరారయ్యారు. బాలిక తల్లింద్రులు ఈ విషయాన్ని.. తమ బంధువులైన బాలుడి కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే ఆ కుటుంబసభ్యులు సైతం తిరిగి బెదిరించగా చేసేదేమిలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, మహారాష్ట్రలోని ఓ 11 ఏళ్ల బాలికపై 58 ఏళ్ల వాచ్​మన్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వాచమన్​​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నుమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:'మరో హిందీ వ్యతిరేక ఉద్యమం రానీయకండి'.. ఆ సిఫార్సులపై సౌత్ నేతలు ఫైర్

హిజాబ్​ నిషేధంపై ఎటూ తేల్చని సుప్రీం.. భిన్న తీర్పులిచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు

Last Updated : Oct 13, 2022, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details