Gujarat High Court Non Veg: ప్రజలకు నచ్చినవి తినకుండా నియంత్రించే హక్కు మీకెక్కడదని అహ్మదాబాద్ మున్నిపల్ కార్పొరేషన్‌ను (ఏఎంసీ) ప్రశ్నించింది గుజరాత్ హైకోర్టు. ఆక్రమణల తొలగింపు పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని హెచ్చరించింది. బహిరంగంగా మాంసాహార విక్రయంపై కార్పొరేషన్ విధించిన నిషేధాన్ని తప్పుపడుతూ వీధివ్యాపారాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ విధంగా స్పందించింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. రోడ్డుపై ఆక్రమణలపై పాల్పడుతున్నారంటూ వీధి వ్యాపారులపై ఇటీవల చర్యలు చేపట్టింది. మాంసాహార విక్రయదారులే లక్ష్యంగా కార్పొరేషన్ ఈ చర్యలు చేపడుతోందని ఆరోపిస్తున్నారు మాంసాహారం విక్రయించే వీధివ్యాపారులు. సుమారు 20 మంది వ్యాపారులు ఏఎంసీ చర్యల్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
"బయటకు వస్తే మేము ఏం తినాలో మీరే నిర్ణయిస్తారా? ప్రజలు వాళ్లకు నచ్చినవి తింటారు. భవిష్యత్తులో చెరకురసం తాగకండి.. షుగర్ వస్తుందని చెబుతారా? ఆక్రమణల పేరుతో నాన్‌వెజ్‌ను విక్రయించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు."
-జస్టిస్ వైష్ణవ్, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి