Hardik patel news: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, కీలక నేత హార్దిక్ పటేల్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది నవంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న పటేల్ సామాజిక వర్గానికి చెందిన హార్దిక్.. పార్టీని వీడటం కాంగ్రెస్కు నష్టమే. హార్దిక్ కొంతకాలంగా పార్టీపై గుర్రుగా ఉన్నారు. పేరుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు. అయితే హార్దిక్ ఏ పార్టీలో చేరతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. భాజపాలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.