తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై గొంతు నులిమి.. - జువైనల్ హోం ఎక్కడ ఉంది?

14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. అనంతరం ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. గుజరాత్​లో వెలుగుచూసిన ఈ అమానుష ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడులో జరిగిన మరో ఘటనలో పదో తరగతి చదువుతున్న బాలికను 17ఏళ్ల బాలుడు అపహరించిన పెళ్లి చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది.

RAPE
అత్యాచారం

By

Published : Nov 10, 2021, 8:45 PM IST

గుజరాత్​లోని భరూచ్ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు.

ఇదీ జరిగింది..

అమోద్ పట్టణ సమీపంలోని గ్రామ శివారులో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 'సోమవారం మధ్యాహ్నం కట్టెల కోసం ఇంటి నుంచి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా.. పత్తిచేనులో శవమై కనిపించింది' అని పోలీసులు వివరించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా బాలికపై అత్యాచారం చేసిన నిందితులు.. గొంతు నులిమి హత్య చేశారని వివరించారు. ఈ ఉదంతంలో గుర్తుతెలియని నిందితులపై ఐపీసీతో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

సంఘటన స్థలానికి చేరుకున్న సీనియర్ పోలీసు అధికారులు.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్​తో పాటు.. స్పెషల్ ఆపరేషన్స్ బృందా​లను ఏర్పాటు చేశామని వివరించారు.

బాలికను కిడ్నాప్ చేసిన 17 ఏళ్ల బాలుడు..

తన బంధువైన మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకున్న ఓ మైనర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన తమిళనాడులో జరిగింది.

భవానీ తాలూకాలో 10వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఇంటికి ఆమె బంధువైన 17 ఏళ్ల బాలుడు తరచూ వస్తుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బాలికను అపహరించాడు. దీనిపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం రాత్రి బాలిక ఆచూకీని కనుగొన్న తల్లిదండ్రులు తమవెంట తీసుకొచ్చారు. తమ కూతురిని అపహరించిన బాలుడిపై ఫిర్యాదు చేశారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలుడిని అరెస్టు చేశారు. అనంతరం జువెనైల్ హోంకు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details