తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టెక్​ సిటీలో మద్యానికి పర్మిషన్​- 60ఏళ్లలో తొలిసారి- గెస్ట్​లు, ఎంప్లాయిస్​ తాగొచ్చట! - గుజరాత్ గిఫ్ట్ సిటీ ఆల్కహాల్

Gujarat Gift City Alcohol Permission : గిఫ్ట్‌ సిటీలో ఆల్కహాల్​కు అనుమతిస్తూ గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతిథులకు, ఉద్యోగులకు మద్యపానానికి అనుమతిచ్చింది.

Liquor Permit Gujarat Gift City
Liquor Permit Gujarat Gift City

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 7:14 AM IST

Updated : Dec 24, 2023, 11:43 AM IST

Gujarat Gift City Alcohol Permission : మద్యపాన నిషేధం అమలవుతున్న రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్‌ కీలకమైన నిర్ణయం తీసుకుంది. గిఫ్ట్‌ సిటీగా పిలిచే గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీలో ఆల్కహాల్​కు అనుమతి ఇచ్చింది. గుజరాత్‌లో మద్య నిషేధం నిబంధనను సడలించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో మాత్రం యథావిథిగా మద్య నిషేధం నిబంధనలు అమల్లో ఉంటాయి.

హోటళ్లు, క్లబ్​ల్లో ఆల్కహాల్​కు అనుమతి
1960లో గుజరాత్​ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా దాదాపు 60 ఏళ్లుగా ఇక్కడ మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. తాజాగా గుజరాత్​ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనను సడలించింది. గాంధీనగర్‌లో ఏర్పాటైన గిఫ్ట్‌ సిటీలోని రెస్టారెంట్లు,హోటళ్లు, క్లబ్బుల్లో ఆల్కహాల్‌ సేవనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.

పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకే!
గుజరాత్​లోని గిఫ్ట్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లను ఆహ్వానించాలంటే ఇక్కడ గ్లోబల్‌ బిజినెస్‌ ఎకో సిస్టమ్‌ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో విదేశాల నుంచి వచ్చే వారు, గిఫ్ట్‌సిటీలో పనిచేసే ఉద్యోగులు ఆల్కహాల్‌ను సేవించొచ్చు.

కాంగ్రెస్, ఆప్ ఫైర్​
కాగా, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌, ఆమ్​ఆద్మీ పార్టీ భగ్గుమన్నాయి. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడానికే తొలుత గిఫ్ట్‌సిటీని ఎంచుకున్నారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల యువత మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉందని, నేరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది.

'మద్యం అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో మహిళల పరిస్థితిని చూడండి. అక్కడి కుటుంబాలు నాశనమవుతున్నాయి. మద్యం ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా సామాజిక వ్యవస్థకు విఘాతాన్ని కలిగిస్తుంది. మద్యం వల్ల అభివృద్ధి జరుగుతుందనడానికి ఎక్కడా ఎలాంటి రుజువు లేదు. ఒకవేళ అదే నిజమైతే మద్యం నిషేధం లేని రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటాయి' అని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్​ దోషీ తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద 'ఆఫీస్​'- సూరత్​ డైమండ్​ మార్కెట్​ గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రపంచ వజ్రాల కేంద్రంగా భారత్- సూరత్ డైమండ్ మార్కెట్​ ఒక మోదీ గ్యారంటీ! : ప్రధాని మోదీ

Last Updated : Dec 24, 2023, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details