Gujarath Elections Date : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. మొత్తం 182 నియోజకవర్గాలకు రెండు దశల్లో(డిసెంబర్ 1న, 5న) పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్‌తో కలిపి డిసెంబర్ 8న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితం వెలువడనుంది.
గుజరాత్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు..
మొదటి దశ : డిసెంబర్ 1
- పోలింగ్ జరిగే స్థానాలు : 89
- మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ : నవంబర్ 5
- నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ : నవంబర్ 14
- నామినేషన్ల పరిశీలన : నవంబర్ 15
- నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు : నవంబర్ 17
రెండో దశ : డిసెంబర్ 5
- పోలింగ్ జరిగే స్థానాలు : 93
- రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ : నవంబర్ 10
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : నవంబర్ 17
- నామినేషన్ల పరిశీలన : నవంబర్ 18
- నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు : నవంబర్ 21
- రెండు దశల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8
గుజరాత్లో భాజపా, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉండబోతోంది. 2017లో 182 సీట్లకు గాను 99 సీట్లు గెలిచి భాజపా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది. 77 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ సారి కూడా గెలిచి.. వరుసగా ఆరోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా అవతరించేందుకు కమల దళం ఉవ్విళ్లూరుతోంది. అయితే భాజపాపై వచ్చిన వ్యతిరేకతను కూడగట్టి అధికారం చేజిక్కించుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరో పక్క పంజాబ్‌లో గెలిచి ఊపుమీదున్న ఆప్.. ఈసారి గుజరాత్లో పాగా వేయాలని భావిస్తోంది.
హిమాచల్‌తో పాటే కౌంటింగ్..
హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. వీటితో పాటే గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ భాజపా అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 68 స్థానాలకు ఎన్డీఏ 43 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆమ్ఆద్మీ పార్టీ.. హిమాచల్ ప్రదేశ్‌లోనూ బరిలోకి దిగనుంది.
ఇవీ చదవండి :స్టాలిన్‌తో మమత భేటీ.. 'రాజకీయాలే కాదు అంతకు మించి మాట్లాడాం'
భాజపా ఎమ్మెల్యేకు 'వలపు వల'.. వాట్సాప్‌లో న్యూడ్ వీడియో కాల్!