తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెంపుడు కుక్కల కోసం స్పెషల్ హాస్టల్​- ఎక్కడంటే.. - పెంపుడు కుక్కల హాస్టల్

Dog Hostel : మనుషులకు హాస్టల్స్​ ఉన్నట్టే అక్కడ పెంపుడు కుక్కల కోసం కూడా ఓ ప్రత్యేక వసతి గృహం ఉంది. యజమానులు లేని సమయంలో వారి పెంపుడు కుక్కల బాగోగులు చూడటమే ఈ డాగ్​ హాస్టల్​ పని. మరి అది ఎక్కడ ఉంది? దాని విశేషాలేంటో తెలుసుకుందామా?

dogs
పెంపుడు కుక్కల కోసం హాస్టల్

By

Published : Dec 12, 2021, 1:42 PM IST

పెంపుడు కుక్కల కోసం స్పెషల్ హాస్టల్​

Gujarat dog hostel: జంతుప్రేమికుల్లో చాలామంది ఎంతో ప్రేమతో ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటారు. వాటి ఆలనాపాలనా దగ్గరుండి చూసుకుంటారు. కుటుంబం మొత్తం దూర ప్రాంతాలకు వెళితే పెంపుడు కుక్క‌ల‌ను వెంట తీసుకెళ్ల‌డం సాధ్యం కాదు. వ‌దిలేసి పోదామా అంటే.. వాటి బాగోగులు చూసే వాళ్లుండ‌రు. అలాంటి వారికోసమే గుజరాత్​లో పెంపుడు కుక్కల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు జిగ్నేశ్ అనే వ్యక్తి.

హాస్టల్​లో పెంపుడు శునకం
పెంపుడు శునకం

ఈ డాగ్​ హాస్టల్​ గుజరాత్​లోని వడోదరాలో ఉంది. దూర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు యజమానులు వారి పెంపుడు కుక్కలను ఈ హాస్టల్​లో వదిలేసి వెళ్తే చాలు. నిర్వాహకులే వాటి బాధ్యతలు చూసుకుంటారు. హాస్టల్​లో కుక్కల కోసం అన్ని సదుపాయాలను కల్పిస్తారు.

వడోదరాలో డాగ్​ హాస్టల్

"అత్యవసర పరిస్థితుల్లో యజమానులు వారి పెంపుడు కుక్కలను వదిలి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి కుక్కలకు ఆశ్రయం కల్పించడమే లక్ష్యంగా ఈ హాస్టల్​ను ఏర్పాటు చేశాం. కనీస వసతులతో పాటు రోజుకు రెండు సార్లు వాకింగ్​, బేసిక్​ పప్పీ ట్రెయినింగ్​తో పాటు వారానికి ఓసారి గ్రూమింగ్​ చేస్తాం. డాగ్​ షెడ్​లను రోజుకు నాలుగు సార్లు శుభ్రం చేస్తాం."

-జిగ్నేశ్​ బ్రహ్మక్షత్రియ, నిర్వాహకులు

ఈ వసతి గృహం ప్రస్తుతం యజమానులకు దూరంగా ఉన్న ఎన్నో పెంపుడు కుక్కలకు.. అండగా ఉంటూ.. వాటి ఆలనాపాలనా చూస్తోంది.

ఇదీ చూడండి :'దేశాన్ని మరింత శక్తిమంతం చేస్తాం... రావత్ చూస్తూనే ఉంటారు'

ABOUT THE AUTHOR

...view details