Body parts found in ahmedabad: గుజరాత్ అహ్మదాబాద్లో వివిధ ప్రాంతాల్లో శరీర భాగాలు లభ్యమవుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం నగరంలోని వసానా ప్రాంతంలోని సూరయ్నగర్లో హత్యకు గురైన ఓ వ్యక్తి మొండాన్ని గుర్తించారు పోలీసులు. కాళ్లు, చేతులు, తల లేని మొండెం బయటపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు శుక్రవారం ఆ శరీరానికి సంబంధించిన మరో రెండు భాగాలు లభ్యమయ్యయి. ఎల్లిస్బ్రిడ్జ్ ప్రాంతంలో కాల్గీ క్రాస్ రోడ్ ప్రాంతంలో రెండు కాళ్లను గుర్తించారు పోలీసులు. సినిమా తరహాలో ఉన్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడిని, హంతకుడిని వీలైనంత త్వరగా గుర్తించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
దారుణ హత్య.. ఒక్కోచోట ఒక్కో శరీరభాగం.. అసలేమైంది? - శరీర భాగాలు లభ్యం అహ్మదాబాద్
Body parts found in ahmedabad: గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం జరిగింది. గత కొద్ది రోజులుగా నగరంలోని ఒక్కో చోట ఒక్కో శరీర భాగం పోలీసుల కంట పడుతోంది. ఇటీవల ఓ మొండాన్ని గుర్తించగా.. శుక్రవారం మరో ప్రాంతంలో రెండు కాళ్లను గుర్తించారు.

హత్య కలకలం
వసానా, ఎల్లీస్బ్రిడ్జ్ ప్రాంతాల్లో లభ్యమైన శరీర భాగాలను డీఎన్ఏ పరీక్షల కోసం తరలించారు పోలీసులు. రెండు ప్రాంతాల్లోనూ దొరికిన శరీర భాగాలు ఒకరివే అని తేలడం సహా మృతిచెందిన వ్యక్తి ఎవరో తెలిస్తే దర్యాప్తు వేగవంతం అవుతుందన్నారు పోలీసులు. నిందితుడి త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :రోడ్డుపై భారీ ట్రక్కును అడ్డుకొని.. ఏనుగు ఏం చేసిందంటే?