తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భర్త వీర్యం కోసం పిటిషన్ వేసిన మహిళ ఇంట విషాదం - covid patient died after sperm collection

హైకోర్టు ఆదేశాలతో.. కరోనా బాధితుని వీర్యాన్ని వైద్యులు సేకరించిన ఒక్కరోజు తర్వాత సదరు వ్యక్తి ఆస్పత్రిలోనే మరణించాడు. ఈ కేసుపై తదుపరి విచారణకు కొద్ది గంటల ముందే ఈ ఘటన జరిగింది.

covid patient sperm collection
వీర్యం సేకరించాక భర్త మృతి

By

Published : Jul 23, 2021, 1:06 PM IST

కరోనా బాధిత భర్త వీర్యం కోసం గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఇంట విషాదం నెలకొంది. కోర్టు ఆదేశాలతో వీర్యం సేకరించిన ఒక్కరోజు తర్వాత.. ఆమె భర్త కన్నుమూశాడు. ఈమేరకు సదరు మహిళ తరఫు న్యాయవాది నీలాయ్​ పటేల్ శుక్రవారం తెలిపారు.

"మంగళవారం.. కోర్టు అనుమతులిచ్చిన కొద్దిసేపటి తర్వాత తాము మహిళ భర్త నుంచి వీర్యాన్ని సేకరించామని ఆస్పత్రి వర్గాలు మాకు సమాచారాన్ని అందించాయి. అయితే.. గురువారం అతడు మృతి చెందాడు. ఈ కేసులో తదుపరి విచారణ శుక్రవారం జరగాల్సి ఉంది."

-నీలాయ్​ పటేల్​, న్యాయవాది

అసలేంటీ కేసు?

వడోదరాలోని స్టెర్లింగ్​ ఆస్పత్రిలో కొవిడ్​తో చికిత్స పొందుతున్న తన భర్త నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఐవీఎఫ్​ విధానంలో తల్లి కావాలని ఓ మహిళ ఆశించింది. అయితే.. అందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. కోర్టు అనుమతులిస్తేనే తాము వీర్యాన్ని సేకరిస్తామని చెప్పారు. దీంతో గుజరాత్ హైకోర్టులో ఆ మహిళ పిటిషన్​ దాఖలు చేసింది.

ఈ పిటిషన్​పై మంగళవారం విచారణ న్యాయస్థానం.. సదరు కొవిడ్​ బాధితుని నుంచి వీర్యాన్ని తక్షణమే సేకరించాలని ఆస్పత్రిని నిర్దేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దాన్ని తగిన విధంగా భద్రపరచాలని సూచించింది.

'ఆ రోజే సేకరించారు..'

కోర్టు ఆదేశించిన తర్వాత మంగళవారమే ఆ వ్యక్తి వీర్యాన్ని వైద్యులు సేకరించారని స్టెర్లింగ్​ ఆస్పత్రి జోనల్ డైరెక్టర్​ అనిల్​ నంబియార్​ బుధవారం తెలిపారు. కోర్టు అనుమతి ఇస్తే.. ఐవీఎఫ్ విధానం కోసం దాన్ని వినియోగిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:ఆ 256 మంది చిరు వ్యాపారులు.. 'పేద' కోటీశ్వరులు!

ఇదీ చూడండి:అత్యంత ఖరీదైన బర్త్​డే పార్టీలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details