తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రోగికి భాజపా ఎమ్మెల్యే ఇంజెక్షన్​పై దుమారం​ - వైద్యుడి అవతారమెత్తిన ఎమ్మెల్యే

ఐదో తరగతి విద్యార్హతలు ఉన్న ఓ భాజపా ఎమ్మెల్యే.. కరోనా రోగికి రెమ్​డెసివిర్​ ఇంజెక్షన్​ వేస్తున్నట్లు కనిపించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కరోనా రోగులను అడ్డుపెట్టుకుని.. ప్రచారం కోసం ఎమ్మెల్యే యత్నిస్తున్నారని కాంగ్రెస్​ విమర్శించింది.

mla remedisivir given
వైద్యుడి అవతారంలో ఐదో తరగతి పాసైన ఎమ్మెల్యే!

By

Published : May 24, 2021, 9:28 AM IST

Updated : May 24, 2021, 9:34 AM IST

రోగులకు ఇంజెక్షన్​ వేస్తున్న ఎమ్మల్యే వీడియో

గుజరాత్​లో ఐదో తరగతి పాసైన ఓ భాజపా ఎమ్మెల్యే.. కరోనా రోగికి రెమ్​డెసివిర్​ ఇంజెక్షన్​ ఇవ్వటం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సూరత్​లోని సర్తానా ప్రాంతంలో భాజపా నేతలు నెలకొల్పిన ఓ ఐసోలేషన్​ కేంద్రంలో కరోనా రోగికి ఇంజెక్షన్​ వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించారు కామ్​రాజ్​ నియోజకవర్గ ఎమ్మెల్యే వీడీ ఝలవాడియా. అయితే.. తాను ఇంజెక్షన్​ వేయలేదని మిక్స్ మాత్రమే చేశానని ఎమ్మెల్యే అన్నారు.

"సర్తానాలోని ఈ ఐసోలేషన్ కేంద్రంలో 40 రోజులుగా నేను పని చేస్తున్నాను. రోగికి రెమ్​డెసివిర్​ ఇంజెక్షన్​ ఇచ్చి హాని తలపెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను ఇంజెక్షన్​ను​ మిక్స్ మాత్రమే​ చేశాను. నేను ఎవరికీ టీకా వేయలేదు. ఆ సమయంలో నా పక్కన 10 నుంచి 15 మంది వైద్యులు ఉన్నారు. ఇక్కడ చికిత్స పొందినవారిలో చాలా మందికి వ్యాధి నయమైంది."

-వీడీ ఝలవాడియా, ఎమ్మెల్యే

డాక్టర్​ డిగ్రీ లేకపోయినా.. వైద్యునిలా ఝలవాడియా వ్యవహరించారని గ్రెస్​ నేత సురేష్​ సోనావానే విమర్శించారు. రోగులకు ఇంజెక్షన్​ వేస్తూ ఫొటో సెషన్​ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ విధంగా ఝలవాడియా.. చీప్​ పబ్లిసిటీ కోసం యత్నించారని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:గుర్రానికి అంత్యక్రియలు- వేల మంది హాజరు

Last Updated : May 24, 2021, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details