తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో కాంగ్రెస్​కు షాక్​.. 10 సార్లు గెలిచిన ఎమ్మెల్యే భాజపా గూటికి - గుజరాత్ ఎన్నికల తేదీ

గుజరాత్​ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్​కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్​సిన్హ్ రత్వా కాంగ్రెస్​ను వీడి.. భాజపా గూటికి చేరారు.

Mohan Singh Rathwa
భాజపాలో చేరిన మోహన్‌సిన్హ్‌ రత్వా

By

Published : Nov 8, 2022, 10:07 PM IST

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్‌సిన్హ్‌ రత్వా కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి.. భాజపా గూటికి చేరారు. దాదాపు 2 దశాబ్దాలుగా అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న హస్తం పార్టీకి ఇది మింగుడుపడని అంశమే. చోటా ఉదయ్‌పూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రత్వా.. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్‌ ఠాకూర్‌కు పంపారు.

భాజపాలో చేరిన మోహన్‌సిన్హ్‌ రత్వా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోహన్‌సిన్హ్‌ రత్వాకు గిరిజన ఓటు బ్యాంకుపై మంచి పట్టుంది. అయితే, తాజా ఎన్నికల్లో తాను పోటీచేయబోనని, చోటా ఉదయ్‌పూర్‌ స్థానాన్ని తన కుమారుడు రాజేంద్రసిన్హ్‌ రత్వాకు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారు. కానీ, ఆ స్థానాన్ని తన కొడుక్కే ఇవ్వాల్సిందిగా ఎంపీ నరన్‌ రత్వా పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విభేదాల నేపథ్యంలోనే మోహన్‌ సిన్హ్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

మోహన్‌సిన్హ్‌ రత్వా

ABOUT THE AUTHOR

...view details