తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో ప్రశాంతంగా స్థానిక పోరు- 42% ఓటింగ్​ - gujarat today elcetion

గుజరాత్​లో మున్సిపల్​ కార్పొరేషన్​ తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. 42 శాతం ఓటింగ్​ నమోదైంది. అహ్మదాబాద్​లో అత్యల్పంగా 38.73 శాతం పోలింగ్​ నమోదవగా.. జామ్​నగర్​లో అత్యధికంగా 49.86 శాతం ఓటింగ్​ నమోదైంది.

gujarat civic polls
గుజరాత్​లో ప్రశాంతంగా తొలిదశ ఎన్నికలు- 42 శాతం ఓటింగ్​

By

Published : Feb 21, 2021, 11:09 PM IST

గుజరాత్​లో స్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 42 శాతం నమోదైంది. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్​, వడోదర, సూరత్​, రాజ్​కోట్​, జామ్​నగర్​, భావ్​నగర్​) నగర కార్పొరేషన్లలో 144 వార్డులకు పోలింగ్​ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కరోనా నిబంధనల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఎక్కడెక్కడ? ఎంతెంత​?

అహ్మదాబాద్​లో అత్యల్పంగా 38.73 శాతం ఓటింగ్​ నమోదు కాగా జామ్​నగర్​లో అత్యధికంగా.. 49.86 శాతం ఓటింగ్​ నమోదైంది. రాజ్​కోట్​ 47.27 శాతం, భావ్​నగర్​ 43.66 శాతం, సూరత్​ 43.52 శాతం, వడోదర 43.47 ఓటింగ్​ శాతం నమోదైంది.

ఓటు వేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఓటు వేసిన నవ దంపతులు

అంతా ప్రశాంతంగానే..

ఓటింగ్​ ప్రశాంతంగా పూర్తైనట్లు గుజరాత్​ రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ సంజయ్​ ప్రసాద్​ తెలిపారు. ఓటర్లకు, రాజకీయ పార్టీలు, అధికార సిబ్బంది, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఫిబ్రవరి 28న జరగనున్న ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొనాలని ప్రజలను కోరారు. అహ్మదాబాద్​, సూరత్​లో రాజకీయ పార్టీల చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్​లో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించాయని చెప్పారు.

తొలిదశ పోలింగ్​లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. తన కుటుంబ సభ్యులతో కలిసి అహ్మదాబాద్​లోని నారన్​పుర వార్డులో ఓటు వేశారు.కరోనా నుంచి కోలుకున్న గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ.. తన స్వస్థలమైన రాజ్​కోట్​లో ఓటు వేశారు. వృద్ధులు, వికలాంగులు, నవ వధూవరులు ఓటింగ్​లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఓటింగ్​లో పాల్గొన్న వృద్ధులు
ఓటింగ్​లో పాల్గొన్న స్వామీజీలు
గుర్రం మీద వచ్చి ఓటు వేసిన ఓటర్​

ఏ పార్టీ? ఎన్ని స్థానాల్లో?

రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక ఎన్నికలు కీలకంగా మారాయి. భాజపా, కాంగ్రెస్​లు ప్రధాన పోటీదారులుగా నిలవగా.. వాటికి తమ పార్టీయే ప్రత్యామ్నాయంగా భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్​). మొత్తం 575 స్థానాలకు 2276 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భాజపా నుంచి 577, కాంగ్రెస్ 566, ఆమ్​ఆద్మీ పార్టీ 470, ఎన్సీపీ 91, ఇతరులు 353, స్వతంత్రులు 228 మంది బరిలో నిలిచారు. అసదుద్దీన్​ ఒవైసీకి చెందిన ఎఐఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్) కూడా 21 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

6 నగరాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. 11,121 పోలింగ్​ బూత్​లు ఏర్పాటు చేయగా వాటిల్లో 2255 సున్నితమైనవని, 1188 అత్యంత సున్నితమైనవిగా పేర్కొన్నారు. మొత్తం 32,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. రెండో దశలో 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:'చట్టాలు రైతుల పాలిట డెత్​ వారెంట్​ లాంటివే'

ABOUT THE AUTHOR

...view details