గుజరాత్లో స్థానిక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పటిష్ఠ భద్రత మధ్య ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు అధికారులు. అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదరా, భావ్‌నగర్, జామ్‌నగర్‌కు చెందిన 144 వార్డుల్లోని 576 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి.
గుజరాత్ 'స్థానికం'లో భాజపాదే హవా! - gujarat local body elections counting
గుజరాత్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాథమిక ఫలితాలను బట్టి భాజపా ఆధిక్యంలో ఉనట్టు తెలుస్తోంది.
![గుజరాత్ 'స్థానికం'లో భాజపాదే హవా! Gujarat Civic Polls Counting of votes f](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10740262-580-10740262-1614059960973.jpg)
గుజరాత్ స్థానిక సంస్థల ఫలితాలు
ఈ స్థానాలన్నీ ఇప్పటివరకు భాజపా అధీనంలోనే ఉన్నాయి. కౌంటింగ్ సరళిని బట్టి భాజపానే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. జామ్జోధ్పుర్, థాల్తేజ్, వస్త్రాపుర్, అసార్వా, సాయిజ్పుర్, నవ వదాజ్, నవరంగపుర వార్డుల్లో భాజపా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దరియాపుర్, చందేఖేడా వార్డుల్లో కాంగ్రెస్, బెహ్రంపురాలో ఎంఐఎం లీడింగ్‌లో ఉంది.
ఇదీ చదవండి:కర్ణాటకలో జిలెటిన్ పేలి ఆరుగురు మృతి