గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల వైరస్ బారిన పడిన రూపానీ.. కొవిడ్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వారంలోనే కరోనా నుంచి కోలుకున్న గుజరాత్ సీఎం - Gujarat CM news updates
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా నెగెటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
గుజరాత్ సీఎంకు కరోనా నెగిటివ్
ఈ నెల 15న ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదరలో వేదికపై ప్రసంగిస్తూ కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని యూ.ఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. అనంతరం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వారం వ్యవధిలోనే ఆయన కోలుకోవడం విశేషం.
ఇదీ చూడండి:గుజరాత్ సీఎంకు కరోనా పాజిటివ్