గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీకి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదరలో వేదికపై ప్రసంగిస్తూ కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని యూ.ఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఆదివారం తెలిపారు.
గుజరాత్ సీఎంకు కరోనా పాజిటివ్ - గుజరాత్ సీఎం
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీకి కరోనా సోకింది. ఆదివారం అస్వస్థతకు గురైన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు తెలిసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
కరోనా పరీక్షల నిమిత్తం ఆదివారం రాత్రి శాంపుల్స్ సేకరించారు వైద్యులు. ఈ టెస్టుల్లో వైరస్ సోకినట్లు బయటపడిందని ఆసుపత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని రుపానీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:వేదిక మీదే కుప్పకూలిన ముఖ్యమంత్రి
Last Updated : Feb 15, 2021, 1:39 PM IST