2004 నాటి ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అరెస్టైన ముగ్గురు పోలీసు అధికారులు జీఎల్ సింఘాల్, తరుణ్ బరోత్, అనజు చౌదరికి ఊరట లభించింది. ఈ కేసు నుంచి వారికి విముక్తి కల్పిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
గుజరాత్ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీని హత్యచేయడానికి ఇష్రత్ జహాన్‌తో పాటు జావేద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిల్లై, అంజద్ అలీ అక్బరలీ రానా, జోషన్ జోహార్ అనే ఉగ్రవాదులు కుట్రపన్నారని ఆరోపిస్తూ వారిని 2004 జూన్‌లో పోలీసులు అహ్మదాబాద్‌లో ఎన్కౌంటర్ చేశారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు రాగా... ఈ వ్యవహారం మొత్తం తీవ్ర వివాదాస్పదమైంది.