మోర్బీ తీగల వంతెన దుర్ఘటనకు సంబంధించి.. గుజరాత్ ప్రభుత్వం మోర్బీ మున్సిపాలిటీ ముఖ్య అధికారి సందీప్ సిన్హా జాలాను సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని మోర్బీ జిల్లా కలెక్టర్ జీటీ పాండ్యా శుక్రవారం తెలిపారు.
తీగల వంతెన కాంట్రాక్ట్‌ను 15 ఏళ్లపాటు ఒరెేవా గ్రూప్‌నకు మోర్బీ మున్సిపాలిటీ అప్పగించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒరేవా గ్రూప్‌నకు చెందిన నలుగురు ఉద్యోగులు సహా 9 మందిని అరెస్ట్ చేశారు.
గుజరాత్ తీగల వంతెన ఘటనలో.. మోర్బీ మున్సిపల్ అధికారి సస్పెండ్ - మోర్బీ కేసులో సస్పెండ్ అయిన అధికారి
మోర్బీ తీగల వంతెన దుర్ఘటనకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం ఓ అధికారిని సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని మోర్బీ జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మోర్బీ మున్సిపల్ అధికారి సస్పెండ్
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఆదివారం కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయిన దుర్ఘటనలో 135 మంది మరణించారు. మచ్చూ నదిపై ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. అంతకుముందు.. వంతెనకు ఏడు నెలల పాటు మరమ్మతులు నిర్వహించారు. రిపేర్లు పూర్తై.. వంతెన తెరిచిన నాలుగోరోజే ఈ దుర్ఘటన జరిగింది.