తిరుమల కొండలపై వెలిసిన శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా భాసిల్లుతున్నారు. ఆ శ్రీవారిని కొలిచినంతనే మొక్కులు తీర్చుతారని భక్తుల విశ్వాసం. అందుకే దక్షిణ భారతంలోనే కాక ప్రపంచం నలుమూలలా ఆ బాలాజీ భక్తులు కనిపిస్తుంటారు. ఈ ప్రమోద్ దంపతులు కూడా ఆ శ్రీనివాసుడి భక్తులే.
వీళ్ల స్వస్థలం.. గుజరాత్ ద్వారక సమీపంలోని ఓ గ్రామం. ప్రమోద్ వయస్సు.. 75 ఏళ్లు. ఆయన సతీమణి వయస్సు కూడా 70కి పైనే. ఈ వయస్సులో వీళ్లు.. గుజరాత్ ద్వారక నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాలినడకన 3 నెలల క్రితం అంటే 90 రోజుల క్రితం బయలుదేరారు. ఓ తోపుడు బండిపై వాళ్లకు అవసరమైన సామగ్రిని పెట్టుకొని దాన్ని తోసుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. ఆయనతో పాటే సహధర్మచారిణి కూడా చేతికర్ర సాయంతో నడిచి వస్తున్నారు. ఇలా రోజుకు కొంత దూరం నడుస్తూ దాదాపు 16 వందల కిలోమీటర్ల దూరాన్ని కరిగించేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్ చేరుకున్నారు. మరో 500 కిలోమీటర్ల పైన ప్రయాణాన్ని సాగించాల్సి ఉంది.
అసలు ఈ మిథునం.. ఈ వయస్సులో ఈ సాహసానికి పూనుకోవడానికి కారణం ఏంటో వారి మాటల్లోనే విందాం.