Gujarat ATS detain Teesta Setalvad: గుజరాత్ అల్లర్ల కేసులో జకియా జాఫ్రీకి న్యాయసాయం అందించిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను.. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. మోదీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన జకియాకు.. సెతల్వాద్‌కు చెందిన ఎన్జీఓ న్యాయసాయం అందించింది. అప్పటి గుజరాత్ అల్లర్లలో జకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జఫ్రీ చనిపోయారు. అహ్మదాబాద్ సిటీ క్రైం బ్రాంచ్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా... ముంబయి శాంటాక్రూజ్‌లోని నివాసంలో సెతల్వాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్ అల్లర్ల కేసు.. 'ఆమె'కు న్యాయసహాయం అందించిన కార్యకర్త అరెస్ట్!
Gujarat ATS Teesta Setalvad: గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసిన జకియా జాఫ్రీకి.. న్యాయసాయం అందించిన కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను ఆ రాష్ట్ర ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. అహ్మదాబాద్‌లో నమోదైన ఓ కేసులో భాగంగా ఆమెను ముంబయిలో నిర్బంధించింది.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎం, ప్రస్తుత ప్రధాని మోదీకి సిట్ క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన ఒకరోజు తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ సహా 64 మందికి సిట్.. క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ మేరకు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలను జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. 2021 డిసెంబర్ 9న ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరించింది. సిట్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు 2017లోనే ఈ కేసును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సైతం సుప్రీం సమర్థించింది.
ఇదీ చదవండి: