Godhra riots 2002: గుజరాత్లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం కేసులో ప్రత్యేక సిట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 35వ నిందితుడిగా ఉన్న రఫిక్ భతుక్ను దోషిగా తేల్చింది కోర్టు. చారిత్రక గోద్రా అల్లర్ల కేసులో భతుక్కు జీవిత ఖైదు విధించినట్లు స్పెషల్ ప్రొసిక్యూటర్ ఆర్సీ కొడెకర్ తెలిపారు. గోద్రా అల్లర్ల అనంతరం దేశంలోని వివిధ నగరాల్లో భతుక్ తిరుగుతుండగా.. గతేడాది ఫిబ్రవరిలో భతుక్ను పట్టుకున్నారు పంచ్మహల్ స్పెషల్ ఆపరేషన్ పోలీసులు.
అంతకుముందు గోద్రా అల్లర్ల కేసులో 2011 మార్చి 1న ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా తేల్చింది. అనంతరం 11 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది. 11 మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 2017అక్టోబర్లో గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టులో ఫరూఖ్ భనా, ఇమ్రాన్ షెరీకి జీవిత ఖైదు విధిస్తూ సిట్ కోర్టు తీర్పునిచ్చింది. మరో ముగ్గురిని నిర్ధోషులుగా విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు.