తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారిని రేప్​ చేసి దారుణ హత్య - gujarat 4 year old girl rape

గుజరాత్​లో అత్యంత దారుణ ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని రేప్​ చేశాడో కిరాతకుడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్​లో పెట్టి బాత్​రూం కిటికీ నుంచి బయటకు విసిరాడు. పాప కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.

gujarat-a-four-year-old-girl-was-brutally-murdered-in-naroli-of-dadra-nagar-haveli
చిన్నారిని రేప్​ చేసి దారుణ హత్య

By

Published : Mar 13, 2021, 1:55 PM IST

Updated : Mar 13, 2021, 5:24 PM IST

గుజరాత్​లోని నరోలిలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడో కిరాతకుడు. అనంతరం పాప మృతదేహాన్ని బ్యాగ్​లో పెట్టి బాత్​రూం కిటికీ నుంచి బయటకు విసిరాడు. తమ బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నాలుగేళ్ల చిన్నారిని రేప్​ చేసి దారుణంగా హత్య చేసిన కిరాతకుడు
నాలుగేళ్ల చిన్నారిని రేప్​ చేసి దారుణంగా హత్య చేసిన కిరాతకుడు

ఇదీ జరిగింది..

చిన్నారి కుటుంబం దాద్రా నగర్ హవేలీ నరోలి గ్రామ సొసైటీలో నివాసముంటోంది. ఆడుకోవడానికి వెళ్లిన పాప చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం తల్లిదండ్రులు వెతికారు. ఎంతకూ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అపార్ట్​మెంట్​ టాయిలెట్​ పైప్​లైన్​ పక్కనే ఉన్న ఓ బ్యాగులో పాప మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఆ సొసైటీలోని 40 ప్లాట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్​ నెెం 109లో రక్తపు మరకలు కనిపించడం, బాత్​రూం కిటికీ పగలి ఉండటం గమనించిన పోలీసులు అందులో నివసిస్తున్న యువకుడిని అరెస్టు చేశారు.

నాలుగేళ్ల చిన్నారిని రేప్​ చేసి దారుణంగా హత్య చేసిన కిరాతకుడు
నాలుగేళ్ల చిన్నారిని రేప్​ చేసి దారుణంగా హత్య చేసిన కిరాతకుడు

పాపను చంపి మృతదేహాన్ని బ్యాగులో పెట్టి బాత్​రూం కిటికీ నుంచి బయటకు విసిరినట్లు నిందితుడు సంతోష్ రజత్​ అంగీకరించాడు. పాప ఆడుకుంటుండగా ఎవరూ లేని సమయంలో ఎత్తుకెళ్లాడు. నిందితుడు గతంలోనూ తమతో దురుసుగా ప్రవర్తించాడని అపార్ట్​మెంట్​ వాసులు తెలిపారు.

నాలుగేళ్ల చిన్నారిని రేప్​ చేసి దారుణంగా హత్య చేసిన కిరాతకుడు

ఈ ఘటన గురించి తెలిసిన అనంతరం పాప కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్నారి తండ్రి ఈ దారుణాన్ని తట్టుకోలేక పినాయిల్​ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి:అసోంలో రూ.31 కోట్ల నగదు, బంగారం స్వాధీనం

Last Updated : Mar 13, 2021, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details