తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో కూలిన కేబుల్​ బ్రిడ్జ్​- 60 మంది మృతి

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ పట్టణంలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 60 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

Gujarat a cable bridge collapsed in the Machchhu river
గుజరాత్​లో కూలిన కేబుల్​ బ్రిడ్జ్​- అనేక మందికి గాయాలు

By

Published : Oct 30, 2022, 7:43 PM IST

Updated : Oct 30, 2022, 9:56 PM IST

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ పట్టణంలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 60 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను మోహరించారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో నీటిలో మునిగిపోయారు.

కారణం ఇదేనా?
దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పనులు పూర్తి చేసి తిరిగి ప్రజల సందర్శన కోసం తెరిచారు. అది జరిగిన నాలుగైదు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో జనం ఈ వంతెనపై నిలబడటంతో సామర్థ్యానికి మించి బరువు కావడం వల్ల కూలినట్టుగా సమాచారం. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేశ్‌ మెజ్రా మాట్లాడుతూ.. "ఈ తీగల వంతెన కూలిపోవడంతో పలువురు నదిలో పడిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించారు" అని తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తీగల వంతెన కూలిపోయిన సమయంలో దానిపై పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు.

ఘటనా స్థలానికి బయల్దేరిన సీఎం.. మృతులకు పరిహారం ప్రకటన..
ఈ ఘటనతో తన అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకొని మోర్బికి బయల్దేరినట్టు సీఎం భూపేంద్ర పటేల్‌ వెల్లడించారు. అక్కడి పరిస్థితిని నేరుగా సమీక్షించనున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఆ కుటుంబాలకు సాయం ప్రకటించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ పీఎంవో ట్వీట్‌ చేసింది. అంతకుముందు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు పలువురు అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు మోదీ. యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను తరలించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించినట్టు పీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది.

వంతెన చరిత్ర..
ఈ వంతెన 1879 ఫిబ్రవరి 20న బాంబే గవర్నర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ ప్రారంభించారు. అప్పట్లో రూ.3.5లక్షల వ్యయంతో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు. దర్బార్‌గఢ్‌ -నాజర్‌బాగ్‌ను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనకు దాదాపు 140 ఏళ్ల చరిత్ర ఉంది. దీని పొడవు 765 అడుగులు.

Last Updated : Oct 30, 2022, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details