తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శివాజీ, బిగ్​బీ, నీరజ్.. కట్టిపడేసేలా ప్రముఖుల 'రంగవల్లులు' - రంగవల్లుల ప్రదర్శన

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దీపావళి సన్నాహాలు ఊపందుకున్నాయి. వెలుగు దివ్వెల పండుగను పురస్కరించుకుని రంగవల్లుల (Rangoli Rajkot) ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, బహుబలి కట్టప్ప రంగవల్లులు... (Rajkot Rangoli Competition) వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Rajkot Rangoli Competition
రాజ్​కోట్ రంగవల్లులు

By

Published : Oct 24, 2021, 10:21 AM IST

రాజ్​కోట్​లో రంగవల్లులు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అద్భుత రంగవల్లులు (Rajkot Rangoli Competition) కొలువుదీరాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని అజంతా ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో (Rangoli Rajkot) 77 మంది కళాకారులు... అబ్బురపరిచేలా ఉన్న 125 ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు. వివిధ రంగాల్లోని ప్రముఖుల చిత్రాలతో రంగవల్లులు వేశారు.

బాహుబలిలో కట్టప్ప...
.

దేవుళ్ల ముగ్గులు, పర్యావరణం, ఛత్రపతి శివాజీ, బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా, సాధువు, అందమైన యువతి, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ చిత్రాలను రంగవల్లుల్లో అందంగా తీర్చిదిద్దారు. ఛాయచిత్రాలను తలపించేలా వేసిన ఈ ముగ్గులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నీరచ్ చోప్రా చిత్రం

ఈ రంగవల్లులను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రముఖుల ఖ్యాతి, పర్యావరణంపై మరింత అవగాహన కల్పించేందుకు ఈ రంగవల్లుల ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:ఆ అవినీతి తిమింగలాలను పట్టుకొచ్చి, తిన్నది కక్కిస్తేనే..

ABOUT THE AUTHOR

...view details