కరోనా వేళ ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. ఇదే అదనుగా ఆక్సిజన్ సిలిండర్లపై తన పోస్టర్లు అతికించి ప్రచారం చేసుకుంటున్నారు గుజరాత్ అమ్రేలీ జిల్లాకు చెందిన భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే హీరా సోలంకి. ప్రజలకు సాయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఛతదియా రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలను 25 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. దీనిని సోలంకి ప్రారంభించారు. కరోనా బాధితుల కోసం భోజన వసతి కల్పించారు.
ఈ కొవిడ్ కేర్ సెంటర్ కోసమే 150 పైగా ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చారు సోలంకి. ఇంతా చేసిన సోలంకి.. ప్రజలను ఆకర్షించడానికి ఆక్సిజన్ సిలిండర్లపై తన ఫొటో, పేరు ఉన్న పోస్టర్లను అతికించారనే అపవాదు మూటకట్టున్నారు.