గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే భీఖాభాయ్ జోషి సహా ఆయన ముగ్గురు కుమారులకు మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 2008లో పంచాయతీ ఎన్నికల వివాదంలో ఓ కుటుంటంలోని ముగ్గురు వ్యక్తులపై దాడి కేసులో ఈ మేరకు శనివారం తీర్పునిచ్చింది.
జోషి ముగ్గురు కుమారులు భరత్, మనోజ్, జయంతిలకు ఏడాది జైలుతో పాటు రూ.5వేల జరిమానా విధించింది కోర్టు. అయితే వారికి ఆ తర్వాత బెయిలు మంజూరైంది.