తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్ సైనికులతో కలిసి భారత జవాన్ల దీపావళి వేడుకలు - బాడ్మేర్​ సరిహద్దు దీపావళి వార్తలు

భారత్​- పాక్ సరిహద్దుల్లో(India Pak border news) దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. అట్టారీ- వాఘా సరిహద్దు(Wagah border news) వద్ద పాకిస్థాన్​ సైనికులకు భారత జవాన్లు మిఠాయిలు పంచి పెట్టారు. కశ్మీర్​ టీట్​వాల్​లోని సరిహద్దు ఒంతెనపైనే భారత్​- పాక్ జవాన్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

border
భారత్​- పాక్ సరిహద్దు

By

Published : Nov 4, 2021, 6:40 PM IST

భారత్​- పాక్ సరిహద్దు

భారత్- పాక్ సరిహద్దుల్లో(India Pak border news) దీపావళిని సైనికులు ఘనంగా జరుపుకున్నారు. ఇరు దేశాల సైనికులు ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. పంజాబ్​లోని అమృత్​సర్​ దగ్గర ఉండే అట్టారీ- వాఘా సరిహద్దు(Wagah border news) వద్ద పాక్ రేంజర్స్​కు భారత జవాన్లు మిఠాయిలు పంచి పెట్టారు.

పంజాబ్​లోని అట్టారీ- వాఘా సరిహద్దు
వాఘా సరిహద్దు వద్ద పాక్ సైనికుడికి స్వీట్లు అందిస్తున్న భారత జవాన్లు
వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు

కశ్మీర్​లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న టీట్​వాల్ సరిహద్దులో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. సరిహద్దు ఒంతెనపైనే భారత్​- పాక్(India Pak border news) జవాన్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

బాడ్మేర్ సరిహద్దు వద్ద..
పాక్ సైనికుడికి మిఠాయి అందిస్తున్న భారత జవాన్

గుజరాత్​లోని సరిహద్దుతోపాటు​, రాజస్థాన్​లోని బాడ్మేర్​ సరిహద్దుల్లోనూ(Barmer news) భారత్- పాక్ ఆర్మీ(India Pak border news) దీపావళి సంబరాలు చేసుకున్నారు. పాక్ ఆర్మీకి భారత సైనికులు మిఠాయిలు పంచారు.

ఇదీ చూడండి:'మీరే నా కుటుంబసభ్యులు'.. జవాన్లతో కలిసి మోదీ దీపావళి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details