Covid vaccine Children: దేశవ్యాప్తంగా బుధవారం 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ఖరారు చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు వీటిని పంపింది. మరి టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏంటి? ఏ టీకాను వేస్తున్నారు? రెండు డోసుల మధ్య వ్యవధి ఎంత ఉండాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా.. ఈ 10 విషయాలు తెలుసుకోవాల్సిందే... - పిల్లల టీకా మార్గదర్శకాలు
Children vaccine: 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ టీకా పంపిణీ బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపింది. మరి ఏ టీకా వేస్తున్నారు? రిజిస్ట్రేషన్ ఎలా? వంటి వివరాలు మీకోసం.
12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకాలు.. మార్గదర్శకాలివే..
Children Vaccination Guidelines
- 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలదంరికీ కార్బెవ్యాక్స్ టీకా మాత్రమే ఇవ్వాలి. 'బయోలాజికల్ ఈ' సంస్థ దీన్ని తయారు చేసింది.
- మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు 28 రోజుల గ్యాప్ ఉండాలి.
- 2010 తర్వాత జన్మించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలందరూ కొవిన్ పోర్టల్‌లో టీకా కోసం రిజిస్టర్ చేసుకునేందుకు అర్హులు.
- 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ కొవిన్ ద్వారా మాత్రమే టీకా రిజిస్ట్రేషన్ చేయాలి. 12 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్ వేస్తున్నట్లు టీకా వేసేవారు నిర్ధరించుకోవాలి. కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వయసు 12 ఏళ్లు పూర్తికాని పిల్లలకు టీకా వేయకూడదు.
- కొవిన్‌లో ఖాతా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా కోసం అందులోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా టీకా కేంద్రాలకు వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
- వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెషన్లలో మాత్రమే 12-14ఏళ్ల పిల్లలకు టీకా ఇవ్వాలి. పిల్లలకు పొరపాటున వేరే వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉండొద్దనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా దేశంలోని పిల్లలందరికీ ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ ఉచితం.
- 14-15 ఏళ్ల వయసు పిల్లలందరికీ ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్లో భాగంగా వారిని కవర్ చేశారు. వీరంతా కొవాగ్జిన్ తీసుకుంటున్నారు.
- ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.
- అలాగే 60 ఏళ్ల దాటిన వారందరూ మార్చి 16 నుంచి ప్రికాషన్ డోసు(బుస్టర్ డోసు) తీసుకునేందుకు అర్హులు. రెండో డోసు తీసుకున్న 9 నెలల(39వారాలు) తర్వాతే మూడో డోసు తీసుకోవాలి. మొదటి రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకుంటే దాన్నే కొనసాగించాలి.
ఇదీ చదవండి:గుప్తనిధుల కోసం 9 ఏళ్ల చిన్నారి బలి.. అత్త, మామ అరెస్ట్