తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారుడు హత్యకు గురైన 4 రోజులకే తల్లి కూడా.. టీచర్ ఉన్మాదానికి రెండు ప్రాణాలు బలి - కూతురుపై తండ్రి అత్యాచారం

ఉపాధ్యాయుడి దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లి కూడా.. నాలుగు రోజులకు మరణించింది. కుమారుడ్ని రక్షించే ప్రయత్నంలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె గురువారం తుదిశ్వాస విడిచింది. కర్ణాటక గడగ్ జిల్లాలో జరిగిందీ ఘటన.

Guest Teacher Geeta Barakera dies in hospital after inhuman attack
ఉపాధ్యాయురాలు గీతా

By

Published : Dec 23, 2022, 3:58 PM IST

Updated : Dec 23, 2022, 5:03 PM IST

ఉన్మాది దాడిలో కుమారుడ్ని కోల్పోయి.. తీవ్ర గాయాలతో నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న మహిళ గురువారం కన్నుమూసింది. కర్ణాటక గడగ్ జిల్లాలో ఐరన్ రాడ్డుతో స్టూడెంట్​ను.. టీచర్ కొట్టి చంపిన కేసులో బాలుడి తల్లి గీత కూడా మృతి చెందింది. హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. గురువారం ప్రాణాలు విడిచింది.
కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్.. గీత కుటుంబాన్ని ఆసుపత్రిలో పరామర్శించారు.

డిసెంబర్​ 19న హడాలీ ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలలో నాలుగో తరగతి చదవుతున్న భరత్​ను.. అదే స్కూల్​లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ముత్తప్ప.. ఐరన్ రాడ్డుతో కొట్టి, పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి తోసేశాడు. అదే పాఠశాలలో పనిచేస్తున్న బాలుడి తల్లి గీత.. ముత్తును అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన ముత్తు, గీతపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లీబిడ్డలను కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా.. అదే రోజు భరత్​ మృతి చెందాడు. గురువారం బాలుడి తల్లి గీత కూడా చనిపోయింది.

దాడి అనంతరం పారిపోయిన ముత్తప్ప.. డిసెంబర్ 20న పోలీసులకు చిక్కాడు. గడగ్ శివార్లలో అతడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడు​ నేరాన్ని అంగీకరించినట్లు వారు తెలిపారు. గీత తనతో రిలేషన్​షిప్​ మానేసినందునే.. ఆమె కొడుకుపై దాడి చేసినట్లు ముత్తప్ప విచారణలో చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

మానసిక రోగి దాడిలో ముగ్గురు మృతి..
మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తి చేసిన దాడిలో సొంత తల్లి సహా మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం జమ్ముకశ్మీర్​ పహల్​గామ్​ జిల్లా అష్ముకం ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న జావేద్ హసన్.. మొదట ఇంట్లో ఉన్న తన తల్లిపై దాడి చేశాడు. అనంతరం బయటకు వచ్చి మరికొంత మందిపై దాడికి పాల్పడ్డాడు. మృతుల్లో, నిందితుడి తల్లి..హఫీజా బేగంతో పాటు, గులాం నబీ ఖాదిమ్, మహ్మద్ అమీన్ షా అనే వ్యక్తులు ఉన్నారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ మానసిక రోగిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కూతురుపై నాలుగేళ్లుగా తండ్రి అత్యాచారం..
కన్నే తండ్రే(46) కూతురి(20)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా అతడు ఈ దారుణం చేస్తున్నాడు. అందుకు బాధితురాలి తల్లి, ఆమె స్నేహితురాలు సహకరించారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన జరిగింది. కాగా నిందితుల ఆగడాలు భరించలేని బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు, తన కుటుంబంతో కలిసి పుణె, కొంద్వా ప్రాంతంలోని ఓ సొసైటీలో నివాసం ఉంటున్నాడు. వీరంతా ఒడిశాకు చెందిన వారు. నిందితుడు ఓ గ్యారేజీలో పనిచేస్తున్నాడు. బాధితురాలు మైనర్​గా ఉన్నప్పటి నుంచే పలుమార్లు ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు తండ్రి. నిందితుడిని, అతని భార్యను, ఆమె స్నేహితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Dec 23, 2022, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details