2020లో కరోనావైరస్, కొవిడ్-19, టీకా, చైనా, మాస్క్.. ఎక్కువగా ఈ తరహా పదాలే వినిపించాయి. ఈ మహ్మమారి ప్రపంచాన్ని అంతగా అతలాకుతలం చేసింది. గూగుల్‌లో నెటిజన్లు కూడా దీని గురించే ఎక్కువగా శోధించారు. వీటితో పాటు ప్రజలు ఈ ఏడాదిలో ఇంకా ఏఏ అంశాలపై ఆసక్తి చూపారు? వేటికి సమాధానాలు తెలుసుకోవాలనుకున్నారు? వంటి వివరాలతో గూగుల్ ఒక వీడియోను రూపొందించింది.
ఎందుకు గురించే మొత్తం..
'ఎందుకు' అని తెలుసుకోవడం మానవ సహజ లక్షణం. ప్రతి ఒక్కరిని పరీక్షించిన ఈ సంవత్సరంలో 'వై(ఎందుకు)' అనే పదాన్ని ఎక్కువగా శోధించారు’ అని వివరిస్తూ గూగుల్ వీడియో ప్రారంభమవుతోంది. ఎక్కువగా కొవిడ్‌కు సంబంధించిన వెతుకులాటలే ఉన్నాయని తెలిపింది. కాగా, వై అనే పదంతో పాటు వై ఈస్ ఇట్ కాల్డ్ కొవిడ్-19?(ఎందుకు దీన్ని కొవిడ్-19 అని పిలుస్తారు?) అనే ప్రశ్న గురించి నెటిజన్లు విపరీతంగా ఆరాతీశారు. దాంతో పాటు వై బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్?, వై ఈజ్ ఆస్ట్రేలియా బర్నింగ్? వంటి ప్రపంచంపై ప్రభావం చూపిన ఘటనల గురించి తెలుసుకున్నారు.