తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.కోటి పన్ను కట్టాలంటూ రైతుకు జీఎస్​టీ నోటీసులు.. సున్నాలెన్నో కూడా తెలియదన్న బాధితుడు

ఓ రైతుకు జీఎస్​టీ అధికారులు షాక్​ ఇచ్చారు. ఆ రైతు దిల్లీలో రూ.90 కోట్లు లావాదేవీలు చేశాడని.. దాదాపుగా 1.4 కోట్లు పన్ను కట్టాలని నోటీసులు పంపించారు. అయితే తనకు అసలు రూ.90 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదని ఆ బాధితుడు వాపోతున్నాడు.

GST department notice to youth
GST department notice to youth

By

Published : Jan 15, 2023, 8:49 PM IST

రాజస్థాన్​లోని ఓ యువ రైతుకు జీఎస్​టీ అధికారులు షాక్​ ఇచ్చారు. దిల్లీలో రూ.90 కోట్లకు పైగా లావాదేవీలు చేశాడంటూ నోటీసులు పంపించారు. దీనికి గాను రూ. 1,39,79,407 పన్నుగా కట్టాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో అతడు లబోదిబోమంటూ.. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.

అసలేం ఏం జరిగిందంటే..?
జైసల్మేర్​లోని సామ్ గ్రామానికి చెందిన అశోక్​ కుమార్ అనే యువరైతుకు జీఎస్​టీ నోటీసులు అందాయి. "జనవరి 5న జీఎస్​టీ డిపార్ట్​మెంట్​ నుంచి నోటీసులు అందాయి. ఒక్కసారిగా బయపడ్డాను. దీనిపై సంబంధిత అధికారులను కలిశాను. దిల్లీలోని ఓ సంస్థ నా పాన్​కార్డ్​తో లావాదేవీలు చేస్తోందని తెలుసుకున్నాను. నేను దీనిపై ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిగత వివరాలను జీఎస్​టీ అధికారులకు అందించాను. నిజానికి రూ. 90 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు" అని బాధితుడు తెలిపాడు. ఇదిలా ఉండగా.. వీలైనంత త్వరగా పన్ను చెల్లించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

అయితే, ఇదే తరహాలో జైసల్మేర్​లో ఓ వ్యక్తికి జీఎస్​టీ అధికారులు.. కోటిన్నర పన్ను కట్టాలని నోటీసులు పంపించారు. ఆ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details