తెలంగాణ

telangana

ETV Bharat / bharat

GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా! - ట్రేడ్ అప్రెంటీస్ జాబ్స్​ 2023

GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమాలు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్స్​ అండ్ ఇంజినీర్స్​ లిమిటెడ్​ 246 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

engineering jobs 2023
GRSE Apprentice Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 10:42 AM IST

GRSE Apprentice Jobs 2023 : గార్డెన్ రీచ్ షిప్​బిల్డర్స్ & ఇంజినీర్స్ లిమిటెడ్​ 246 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటీస్​, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
Trade Apprentice Jobs 2023 :

  • ట్రేడ్ అప్రెంటీస్​ (ఐటీఐ) - 134
  • ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ - ఫ్రెషర్స్​) - 40
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 25
  • టెక్నీషియన్​ అప్రెంటీస్ - 47
  • మొత్తం పోస్టులు - 246

విద్యార్హతలు
GRSE Apprentice Eligibilities :అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐటీఐ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఆల్​ ఇండియా ట్రేడ్​ టెస్ట్​ (AITT) క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
GRSE Apprentice Age Limit :

  • ట్రేడ్​ అప్రెంటీస్​ (ఎక్సీపీరియన్స్​డ్ ఐటీఐ) అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • ట్రేడ్ అప్రెంటీస్​ (ఫ్రెషర్స్) అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
GRSE Apprentice Selection Process :అభ్యర్థులను.. వారి అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలా లేదా అనేది GRSE అథారిటీ నిర్ణయిస్తుంది. మార్కుల మెరిట్/ రాత పరీక్ష తరువాత.. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఆన్​లైన్​లో అప్లై చేయండి ఇలా!
GRSE Apprentice Online Apply Process :

  • ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్​సైట్​లో అప్రెంటీస్​షిప్​ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తరువాత..
  • గార్డెన్​ రీచ్​ షిప్​బిల్డర్స్​ అండ్ ఇంజినీర్స్​ లిమిటెడ్​ అధికారిక వెబ్​సైట్ https://grse.in ఓపెన్ చేయాలి.
  • కేరీర్స్ ఆప్షన్స్​లో.. ట్రేడ్​ అప్రెంటీస్​/ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​/ టెక్నీషియన్ అప్రెంటీస్​ దరఖాస్తును ఎంచుకోవాలి. తరువాత
  • ఆన్​లైన్​ అప్లై ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ ఐడీ, పాస్​వర్డ్​ జనరేట్ చేసుకోవాలి.
  • లాగిన్ ఐడీ, పాస్​వర్డ్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్​ను పూర్తి చేయాలి. అంటే విద్యార్హతలు, వక్తిగత వివరాలను అప్లికేషన్ ఫారమ్​లో నమోదు చేయాలి. తరువాత ముఖ్యమైన డాక్యుమెంట్స్​ అన్నింటినీ అప్​లోడ్​ చేయాలి.
  • మరోసారి వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్​ చేసుకుని అప్లికేషన్ సబ్​మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
GRSE Apprentice Important Dates :

  • దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.
  • దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 29

BEL Engineering Jobs 2023 : బీఈ, బీటెక్​ అర్హతతో.. BELలో ప్రొబేషనరీ ఇంజినీర్​, ఆఫీసర్​​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

NCL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. NCLలో 1140 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details