Group1 Notification Released in AP: ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గ్రూప్-1 నోటిఫికేషన్‌పై పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఏపీలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల - ఏపీలో గ్రూప్2 2023 నోటిఫికేషన్
Published : Dec 8, 2023, 4:06 PM IST
|Updated : Dec 8, 2023, 4:45 PM IST
16:03 December 08
81 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
పోస్టుల వివరాలు:
- డీఎస్పీ పోస్టులు - 26
- పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్లు - 18 పోస్టుల
- డిప్యూటీ కలెక్టర్లు - 9
- ఆర్టీవోలు - 6
- డిప్యూటీ రిజిస్ట్రార్లు - 5
- జిల్లా ఉపాధికల్పన అధికారులు - 4
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు - 3
- జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు - 3
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ -2
సిలబస్, పరీక్షా విధానం, రిజర్వేషన్లు తదితర సమాచారం వెబ్‌సైట్‌లో లభ్యం
APPSC Group 2 Notification 2023: రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. 2021 జూన్‌లో జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించిన గ్రూప్-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడేందుకు 29 నెలల సమయం పట్టింది. ఈ కాలయాపనతో సుమారు 50 వేల మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయి ఉంటారని అంచనా. ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని నవంబరు 1న ఏపీపీఎస్సీ వెల్లడించింది. కానీ, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 897 పోస్టులే ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. మెయిన్స్ తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది. అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే మెయిన్స్ జరుగుతుందని చెప్పకనే చెప్పింది. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఇవన్నీ జరిగి ఎంపికైన వారు విధుల్లో చేరేందుకు చాలా సమయమే పడుతుంది.